ఇరవై ఏళ్లకు పైగా గ్లామర్‌తో పాటు నటనా పరంగా సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న శ్రియ.. ప్రస్తుతం మిరాయ్ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్నారు.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన శ్రియ.. పాన్–ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు.
మిరాయ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ హిందీ షోలో పాల్గొన్న శ్రియ.. తన తోటి నటీనటులతో కలిసి డాన్స్ వేస్తూ సందడి చేశారు.
ఈ సందర్భంగా ఈ షోలో తొలిసారిగా శ్రియ తన ప్రేమ కథను షేర్ చేసుకున్నారు. మాల్దీవుల ట్రిప్‌కి ఒంటరిగా వెళ్లినప్పుడు రష్యా టెన్సిస్ ప్లేయర్ ఆండ్రీ కోశ్చీవ్తో పరిచయం ఏర్పడిందని చెప్పారు.
అనుకున్న డేట్ కాకుండా పొరపాటున వేరే డేట్‌కి ఫ్లైట్ బుక్ చేయడంతో తాను ఒంటరిగా వెళ్లాల్సి వచ్చిందని.. ఆ సమయంలో ఆండ్రీ పరిచయమైనట్లు చెప్పుకొచ్చారు.
ఆండ్రీ మొదటగా తాను నటించిన దృశ్యం సినిమా చూసినట్లు చెప్పారు. 2018లో వీరిద్దరికీ వివాహం కాగా.. ఈ జంటకు ప్రస్తుతం ఓ పాప ఉంది.