
తెలుగు ప్రజలకు శ్రియ శరన్ పరిచయం అక్కర్లేని పేరు. గ్లామర్‌తో పాటు గ్రేస్ ఉన్న నటిగా ఆమెకు తెలుగు సినిమాల్లో ప్రత్యేక స్థానం ఉంది. వయసు పెరుగుతున్నా తన అందం, ఆకర్షణ కాస్త కూడా తగ్గలేదని మరోసారి నిరూపించింది శ్రియ.

తాజాగా కేరళ వెకేషన్ ఎంజాయ్ చేసిన శ్రియ. తన భర్త ఆండ్రూ కొశ్చీవ్, కుమార్తె రాధాతో కలిసి కేరళకు వెకేషన్‌కి వెళ్లింది. అడవులు, ప్రకృతి సౌందర్యంతో మమేకమై కుటుంబ సమయాన్ని గడిపింది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల్లో పొట్టి డ్రెస్సుల్లో కనిపిస్తూ, తన హాట్ అండ్ స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంది.

ఆమె షేర్ చేసిన ఈ వెకేషన్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా వైరల్ అయ్యాయి. వేలాది మంది అభిమానులు లైక్స్‌తో పాటు ప్రేమభరితమైన కామెంట్లు చేశారు.

40 దాటి వచ్చినా.. శ్రియ అందాన్ని కాపాడుకోవడంలో అసాధారణ నైపుణ్యం కలిగిన నటి అని ఈ ఫొటోలు మరోసారి చాటిచెప్పాయి. “నీ స్మైల్ చాలా క్యూట్”, “యంగ్ గర్ల్‌లా కనిపిస్తున్నావ్”, “నువ్వే బ్యూటీ క్వీన్” అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు.

శ్రియ తన కుటుంబంతో గడిపే సమయాన్ని ఎంతో ప్రాధాన్యతగా తీసుకుంటుంది. ఈ ట్రిప్ లో కూడా ఆమె భర్త, కూతురితో కలసి ఎన్నో ఫొటోలు పంచుకుంది. వెకేషన్‌కి వెళ్లిన శ్రియ, అక్కడి ఫుడ్‌ని కూడా ఆస్వాదించింది. “ఇక్కడి తిండి బాగా నచ్చింది, ఇది మర్చిపోలేని హాలీడే” అంటూ ఇన్‌స్టాలో పేర్కొంది. వెకేషన్‌కి వెళ్లినా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని, ఈ ఫొటోలపై వచ్చిన స్పందన స్పష్టంగా చూపిస్తుంది.