ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ నిత్యవసర వస్తువుగా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇలా వయసుతో సంబంధం లేకుండా ఫోన్లకు బాగా అలవాటు పడిపోయారు. కానీ, ఫోన్ ను లిమిట్ కు మించి వాడితేనే అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ క్రమంలో ఫోన్ ను ఎక్కువగా చూడటం వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం.
కళ్ల సమస్యలు: మొబైల్ ఫోన్ ను ఎక్కువగా వాడితే కంటి సమస్యలు వస్తాయి. కళ్లపై బాగా ఒత్తిడి పడుతుంది. అదేవిధంగా తలనొప్పి, కంఫర్ట్ లేకపోవడం, కళ్లు పొడిబారడం, చూపు మందగించడం, మసక మసకగా కనిపించడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
మెడ, నొప్పి:ఫోన్ ను తరచుగా వాడితే మెడ, చేతి నొప్పి ఖచ్చితంగా వస్తాయి. దీనివల్ల మస్క్యులోస్కెలెటల్ సమస్యలు వస్తాయి. అలాగే అధిక టైపింగ్, స్వైపింగ్ వల్ల చేతులు, భుజాలు, మెడకు సంబంధించిన దీర్ఘకాలిక నొప్పి కలుగుతుంది.
వినికిడి సమస్యలు: ఫోన్ మాట్లాడటం లేదా పాటలు, రీల్స్ చూడటం వల్ల వల్ల వినికిడి సమస్యలు రావొచ్చు. నిపుణుల ప్రకారం.. 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ ను చాలాసమయం పాటు వినకూడదు.
నిద్ర సమస్యలు: మొబైల్ ఫోన్ అధికంగా వాడటం వల్ల నిద్ర సమస్యలు కూడా వస్తాయి. ఫోన్ల నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. కావున, పడుకోవడానికి గంట ముందే ఫోన్ ను వాడకూడదు.
కండరాల సమస్యలు: మొబైల్ ఫోన్ ను చూస్తే కండరాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఎప్పుడూ ఫోన్ వాడితే కండరాలు, ఎముకల్లో నొప్పి కలుగుతుంది.