
ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన బ్యూటీ సిమ్రాన్ చౌదరి. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ.

ఈ సినిమా హిట్ అయినా..సిమ్రాన్ చౌదరికి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. దాంతో అంతగా క్రేజ్ కూడా తెచ్చుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

దీనితో పాటు ఒకటి రెండు సినిమాల్లో చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటి వరకు ఆరు చిత్రాల్లో నటించిన సిమ్రాన్ చౌదరికి ఈ నగరానికి ఏమైంది సినిమానే గుర్తింపు తెచ్చిపెట్టింది.

సిమ్రాన్ సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. నెట్టింట ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. దాంతో ఈ ఫోటోల పై కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ రెగ్యులర్ గా తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో అందాలు ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడు ఇవి నెట్టింట సెగలు రేపుతున్నాయి.