అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల చర్మం చాలా సున్నితం. అందుకే బయటకు వెళ్లే ముందు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇక పండుగ సమయాల్లో పనుల కారణంగా నిద్ర లేమితోనూ పలు సమస్యలు వాటిల్లుతాయి.
దీపావళి సందర్భంగా ఇంట్లో పూజ పనులు, టపాసుల సందడి, ఎక్కువగా స్వీట్లు తినడం.. మీ స్కిన్ టోన్‌పై ప్రభావం చూపిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో కంటే నగరాల్లో ఈ ప్రభావం ఎక్కువ.
ఈ క్రమంలో పండుగ తర్వాత మీ చర్మం మునుపటిలా సున్నితంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని టిప్స్ తప్పనిసరిగా పాటించాలి.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి డబుల్-క్లెన్సింగ్ చేసుకోవాలి. దీనివల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
డబుల్ క్లెన్సింగ్లో భాగంగా ముందుగా మేకప్‌ను పూర్తిగా తొలగించాలి. ప్రధానంగా నూనె ఆధారిత క్లెన్సర్ జొజోబా, బాదం, రోజ్‌షిప్ వంటి స్వచ్ఛత గుర్తులతో కూడిన సహజ నూనెలు మంచి ఫలితాలు ఇస్తాయి.
తరువాత నీటి ఆధారిత క్లెన్సర్.. మైసెల్లార్ నీరు, కొబ్బరి నీటితో క్లీన్ చేసుకోవడం ద్వారా చర్మాన్ని లోతుగా శుభ్రపరచడానికి దోహదపడుతుంది. తద్వారా చర్మ పోషణ, స్కిన్‌పై సహజ రసాయనాలు తొలగిపోకుండా ఉంటాయి.