Skin Glow by Beatroot Facepack easy to try at Home: పండుగ వచ్చిందంటే చాలు కొత్త బట్టలతో తళుక్కున మెరవాలని అందరూ ఆటోచిస్తుంటారు. ముఖ్యంగా, దీపావళి పండగకి దీప కాంతుల మధ్య ముఖం అందంగా మెరిసిపోవాలని అమ్మాయిలు కోరుకుంటారు. దీనికి అనేక రకాల క్రీములు, ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేస్తుంటారు. అయినా, ఫలితం ఉండక కొందరు బాధపడుతుంటారు.
కొన్ని సులభమైన చిట్కాలు పాటించడం ద్వారా చర్మాన్ని కాంతిమంతంగా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సహజ పద్ధతుల్లోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెరిసే ముఖాన్ని పొందవచ్చని సలహా ఇస్తున్నారు. ఎలాగో చూద్దాం.బీట్‌రూట్ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. అందుకే బీట్‌రూత్‌తో ఫేస్‌ప్యాక్ చేసుకుంటారు చాలా మంది. అయితే, బీట్‌రూట్‌ను నేరుగా ఇలా ముఖానికి రుద్దడం కంటే, దాన్ని ఐస్ క్యూబ్స్ రూపంలో తయారుచేసి వాడితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు.దీని కోసం ముందుగా బీట్‌రూట్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి, నీళ్లు కలపకుండా మెత్తని పేస్ట్ చేసుకోవాలి. రసం తీసి అందులో పాల మీగడ, కలబంద, తేనె వంటివి కలపాలి. దీన్ని ఐస్ క్యూబ్ ట్రేలో వేసి నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ రెడీ అవుతాయి. వీటిని డైలీ ముఖానికి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.ఐస్ చల్లదనం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి, చర్మం బిగుతుగా మారుతుంది. దీంతో ముఖంపై వాపు తగ్గుతుంది. అయితే, బీట్ రూట్ ఐస్ క్యూబ్స్‌ను ముఖంపై మసాజ్ చేసిన తర్వాత మళ్లీ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీనివల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది.ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో ఉండేలా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమంలో ఉపయోగించిన తేనె, కలబంద జెల్ చర్మంలో తేమను నిలిపి ఉంచి, పొడిబారకుండా కాపాడుందని నిపుణులు చెబుతున్నారు.