Saturday, November 15, 2025
HomeTop StoriesSmriti Mandhana: పెళ్లి పీఠలెక్కబోతున్న స్మృతి మంధాన.. వరుడి ఎవరో తెలిస్తే షాకవుతారు..!

Smriti Mandhana: పెళ్లి పీఠలెక్కబోతున్న స్మృతి మంధాన.. వరుడి ఎవరో తెలిస్తే షాకవుతారు..!

Smriti Mandhana To Marry Music Composer Palash Muchhal: లేడీ కోహ్లీగా తన బ్యాటింగ్‌ ప్రతిభ, అందంతో అభిమానుల మనసు దోచుకున్న క్రికెటర్ స్మృతి మంధానా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. భారత మహిళా క్రికెట్ జట్టులో స్టార్ ఓపెనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్మృతి.. నవంబర్లో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతుంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు సింగర్, డైరెక్టర్, యాక్టర్.. పలాష్ ముచ్చలను ప్రేమ వివాహం చేసుకోబోతుంది.

స్మృతి, పలాష్ గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. దాదాపు 2019 నుంచి సీక్రెట్‌గా లవ్ చేసుకుంటున్నట్లు సమాచారం. చాలా సార్లు బయట కెమెరాలకు చిక్కడంతో వీరి ప్రేమ వ్యవహారం బయటపడింది. అయితే తమ ప్రేమ వ్యవహారం గురించి తరచూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ.. రూమర్స్‌పై స్పందించలేదు.
ఇటీవలే పలాష్ ముచ్చల్ పరోక్షంగా స్మృతితో తన వివాహాన్ని వెల్లడించారు. ‘‘స్మృతి త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది’’ అని మీడియాకు తెలియజేశారు. ఈ జంట తమ ప్రేమ బంధాన్ని ఇప్పుడు పెళ్లి బంధంగా మార్చుకోబోతున్నారని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
తాజాగా, స్మృతి- పలాష్ ముచ్చల్ పెళ్లి తేదీకి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. వీరిద్దరి వివాహం నవంబర్ 20వ తేదీని అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. స్మృతి స్వస్థలమైన మహారాష్ట్రలోని సాంగ్లీలో వీరిద్దరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్.. ఇరు కుటుంబాల నుంచి ఇంకా అధికారిక సమాచారం రానప్పటికీ.. పెళ్లి తేదీ మాత్రం ఇప్పుడు జోరుగా వైరల్‌గా మారింది.
పలాష్ ముచ్చల్ మే 22, 1995న ఒక మార్వాడీ కుటుంబంలో జన్మించాడు. బాలీవుడ్‌లో బాగా పేరుగాంచిన సింగర్. ఈయన గాయని పాలక్ ముచ్చల్ సోదరుడు. రాజ్‌పాల్ యాదవ్-రుబీనా దిలైక్ నటించిన ‘అర్ధ్’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా పలాష్ ముచ్చల్ బాలీవుడ్‌లో అతి పిన్న వయస్కుడైన సంగీత స్వరకర్తగా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad