Saturday, November 15, 2025
HomeTop StoriesSSC: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

SSC: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

SSC Delhi Police Constable Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త అందజేసింది. ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ ఉద్యోగలకు కావాల్సిన అర్హతలేంటో తెలుసుకుందాం.

- Advertisement -
స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌.. దిల్లీ పోలీస్‌ సర్వీస్‌ కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 7,565 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మహిళలకు 2,496, పురుషులకు 4,408, మిగతా పోస్టులను ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు కేటాయించింది.
అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ (10+2 ) ఉత్తీర్ణులై ఉండాలని తెలిపింది. అయితే దిల్లీ పోలీస్ సిబ్బంది కుమారులు/కుమార్తెల సంబంధించిన అర్హతలో సడలింపు ఉంటుంది. పురుష అభ్యర్థులు పీఈ&ఎంటీ తేదీ నాటికి చెల్లుబాటు అయ్యే ఎల్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01-07-2025 నాటికి 18- 25 మధ్య ఉండి తీరాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోసడలింపు వర్తిస్తుంది.
సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్‌ 21 వరకు ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి. రూ.100. ఎస్సీ/ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్, మెజర్‌మెంట్ టెస్ట్ (PE&MT), మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad