Monday, July 14, 2025
Homeగ్యాలరీJOBS: పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

JOBS: పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

SSC JOBS: పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాందించుకునే అవకాశం. స్టాఫ్ ​సెలెక్షన్ కమిషన్(SSC) మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేయవచ్చు. మొత్తం 1075 పోస్టుల కోసం దరఖాస్తుల స్వీకరణ జూన్ 26న ప్రారంభమైంది. జులై 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

పోస్టులు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్), హవల్దార్ (సీబీఐసీ, సీబీఎన్), అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయో పరిమితి: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు 2025, ఆగస్టు 1 నాటికి 18 నుంచి 25 ఏళ్లు, హవల్దార్ పోస్టుకు 2025, ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

పరీక్ష తేదీ: 2025, సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు.

ఎంపిక విధానం: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హవల్దార్ పోస్టులకు రాత పరీక్షతోపాటు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ ఉంటుంది.

పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్ సైట్ సందర్శించవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News