Saturday, November 15, 2025
Homeగ్యాలరీTSCAB: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

TSCAB: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Staff Assistant posts: రాష్ట్ర సహకార బ్యాంకు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ అందించింది. పలు జిల్లాలలోని కేంద్ర బ్యాంకు లలో ఖాళీగా ఉన్న స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. అయితే ఆ ఖాళీలు ఏ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లలో ఉన్నాయో తెలుసుకుందాం.

- Advertisement -

తెలంగాణలోని ఆరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లలో ఖాళీగా ఉన్న 225 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీకి రాష్ట్ర సహకార బ్యాంకు (టెస్కాబ్‌) నోటిఫికేషన్‌ జారీచేసింది.
ఖమ్మం డీసీసీబీలో 99, కరీంనగర్‌-43, హైదరాబాద్‌-32, మహబూబ్‌నగర్‌-9, మెదక్, వరంగల్‌లలో 21 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా నోటిఫికేషన్‌లో తెలిపారు.
డిగ్రీ అర్హత ఉన్న వారు ఈ నెల 19 నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు ఆయా డీసీసీబీల వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటీఫికేషన్‌లో టెస్కాబ్‌ సూచించింది.
అభ్యర్థులకు బ్యాంకు ఉద్యోగుల ఎంపిక సంస్థ అయిన ఐబీపీఎస్‌ ద్వారా డిసెంబరులో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. మరింత సమాచారం కోసం తమ వెబ్‌సైట్‌ https://tgcab.bank.in/ను సంప్రదించాలని టెస్కాబ్‌ సూచించింది.

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad