చక్కెరను స్వీట్లు, ఇతర పదార్థాల తయారీలో ఉపయోగిస్తారని మనకు తెలుసు. కానీ తినే పదార్థం కానే కాకుండా పంచదార వల్ల మరిన్ని ఉపయోగాలున్నాయని మీకు తెలుసా.? అవేంటో చూడండి.
మిక్సీ జార్లు, కాఫీ గ్రైండర్లు ఒక్కోసారి ఎక్కువ రోజులు వాడకుండా మూతపెట్టి అలాగే ఉంచుతాం. దీని వల్ల దుర్వాసన వస్తుంది. అలాంటప్పుడు వీటిలో పావు కప్పు చక్కెర వేసి గ్రైండ్ చేసి తర్వాత శుభ్రంగా కడిగినట్లయితే దుర్వాసన పోతుంది.
చేతులకు ఒక్కోసారి గ్రీజు అంటుకున్నప్పుడు ఎంత కడిగినా పోదు. అలాంటప్పుడు లిక్విడ్ హ్యాండ్ వాష్‌లో కొద్దిగా చక్కెర వేసి ఆ పేస్ట్‌తో చేతులు శుభ్రం చేసుకున్నట్లయితే మరకలు మాయమవుతాయి.
మెరుపు కోల్పోయిన వెండి వస్తువులను తిరిగి మెరిపించడానికి కూడా చక్కెర మంచి చిట్కా. మూడు టేబుల్ స్పూన్ల పంచదారలో ఓ స్పూన్ రోజ్ వాటర్‌ను కలపాలి. చక్కెర కరిగాక దానితో వెండి వస్తువులను శుభ్రం చేయవచ్చు.
చక్కెరతో ఫ్లోర్‌పై పడిన మరకలను సైతం తొలగించవచ్చు. నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్, కొద్దిగా చక్కెర తీసుకుని కలిపిన మిశ్రమాన్ని దూది సాయంతో మరకలపై రుద్దినట్లయితే వెంటనే శుభ్రమవుతుంది.
మూడు టేబుల్ స్పూన్ల చక్కెరలో ఒక నిమ్మచెక్క మిశ్రమాన్ని కలిపి దానిని తుప్పు పట్టిన సామాన్లపై రుద్దినట్లయితే మీ పాత్రలు తళతళా మెరుస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.