శరీర ముఖ్య అవయవాలలో లివర్ ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి, విష పదార్థాలను తొలగించడానికి పనిచేస్తుంది. అయితే అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి అలవాట్లు లివర్ పనితీరును ప్రభావితం చేస్తున్నాయి. కావున కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఆహారాల గురించి తెలుసుకుందాం.
పసుపు: పసుపులో ఉండే కర్కుమిన్ ఆరోగ్యకరమైన కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి విష పదార్థాలను బయటికి పంపిస్తుంది.
ఉసిరి: ఉసిరిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి.
వెల్లుల్లి: ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. ఇంకా శరీరంలో పేరుకుపోయిన విడతలను తొలగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
తులసి: ఉదయాన్నే తులసి ఆకులు తినడం లేదా తులసి టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది కాలేయం నిర్వీషికరణకు సహాయపడే ఆహారం. క్రమం తప్పకుండా దీనిని తీసుకుంటే ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
కొత్తిమీర: కొత్తిమీర ఆకులు, గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో విష పదార్థాలను బయటికి పంపడంలో సహాయపడతాయి.