స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వారుండరు. దీన్ని ఎక్కువగా ఉడకబెట్టి కాస్త ఉప్పు, కారం చల్లి తింటే ఆ టేస్టే వేరు. అయితే ఈ స్వీట్ కార్న్ వల్ల ప్రయోజనాలు, ఇందులో ఉండే పోషకాలు, ఎంత మొత్తంలో తినాలి అనేదానిపై ఇక్కడ తెలుసుకోండి.
స్వీట్ కార్న్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది.
స్వీట్ కార్న్‌లో ఉండే కెరోటినాయిడ్స్ కంటి రెటీనాను సంరక్షిస్తాయి. డిజిటల్ తెరల నుంచి వెలువడే నీలి రంగు కిరణాల బారి నుంచి కళ్లను రక్షించి.. కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి.
స్వీట్ కార్న్‌లో అధికంగా ఉండే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇందులోని పొటాషియం బీపీని నియంత్రిస్తుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వాపులను తగ్గించి.. గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు సైతం స్వీట్ కార్న్‌ను సందేహం లేకుండా తినవచ్చు.
స్వీట్ కార్న్‌ను రోజుకు ఒక కప్పు మోతాదులో తినవచ్చు. ఒక మీడియం సైజ్ స్వీట్ కార్న్ దాదాపుగా 90 గ్రాముల గింజలను కలిగి ఉంటుంది. వీటిని పూర్తిగా తింటే 90 క్యాలరీల శక్తి లభిస్తుంది. గర్భిణీలకు, శిశువు ఎదుగుదలకు మంచిది.