
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలింది. వరుస సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
- Advertisement -

టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి.. మంచి హిట్స్ అందుకుంది.

శ్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తమన్నా.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమా తర్వాత తెలుగులో బాగా బిజీగా మారిపోయింది. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాలను తమన్నా తగ్గించింది.

హిందీ సినిమాలమీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన బోళాశంకర్‌లో నటించింది.

ఇదిలా ఉంటే తమన్నా త్వరలో పెళ్లి పీటలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులను కవ్విస్తుంది ఈ వయ్యారి భామ.