ఏప్రిల్ 15, 1999 నాడు ఏపీలోని విజయవాడలో జన్మించింది దీపికా పిల్లి.తొలుత టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం ద్వారా ఫేమస్ అయింది ఈ బ్యూటీ.ఆ తర్వాత ప్రముఖ రియాలిటీ షో ఢీ 13వ సీజన్ లో క్వీన్స్ టీమ్ కు లీడర్ గా కనిపించింది.2022లో కామెడీ స్టార్స్ ధమాకా సీజన్ 2కి, ఆహాలో కామెడీ స్టాక్ ఎక్చ్సేంజీకి హోస్ట్ గా చేసింది.‘వాంటెడ్ పాండుగాడ్’ మూవీతో హీరోయిన్ గా వెండితెరపై మెరిసింది. ఇందులో సుధీర్ కి జోడిగా నటించింది.రీసెంట్ గా స్టార్ యాంకర్ ప్రదీప్ సరసన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో నటించింది.