Vithika Sheru: టాలీవుడ్ నటి వితిక షేరు పొద్దుతిరుగుడు పూల తోటలో చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు ప్రేక్షకులకు ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ద్వారా మరింత దగ్గరైన నటి వితిక షేరు.సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది.తాజాగా వితిక షేరు పొద్దుతిరుగుడు పూల తోటలో చేసిన ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.పసుపు రంగు పూల అందాల మధ్య వితిక షేరు మెరిసిపోతూ ప్రకృతికే అందాన్ని తెచ్చిపెట్టింది.పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి వైపు చూసినట్లే, వితిక అందం కూడా సూర్యుడిలా ప్రకాశిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.మేకప్ పెద్దగా లేకుండా, తన సహజమైన అందంతోనే వితిక ఫోటోల్లో ఆకట్టుకుంది. ఈ ఫోటోలను వితిక తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారాయి.