మెదడు మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. ఇది మనం ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. దీని పనితీరు సరిగా లేకపోతే ఏ పని సరిగా జరగదు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి వంటి వాటిని మెరుగుపరచాలంటే మంచి ఆహారాన్ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు మెదడును చురుకుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాల్మన్, సార్డిన్స్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి ఆలోచనా శక్తిని పెంచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. వారానికి రెండుసార్లు చేపలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.
బ్లూబెర్రీస్ మెదడును ఫ్రీ రాడికల్స్, వాపు నుండి రక్షిస్తాయి. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. వయస్సుతో పాటు మెదడు క్షీణతను తగ్గిస్తుంది.
వాల్నట్స్, బాదం, గుమ్మడికాయ గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E ని కలిగి ఉంటాయి. ఇవి మెదడు కణాలను రక్షిస్తాయి. దృష్టిని పెంచుతాయి.
పాలకూర, కాలే, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలు మెదడును పోషిస్తాయి. వాటిలో ఉండే విటమిన్ K, ఫోలేట్ జ్ఞాపకశక్తిని బలపరుస్తాయి.
డార్క్ చాక్లెట్లో కోకో, కెఫిన్ ఉంటాయి. ఇవి మానసిక స్థితిని పెంచుతాయి. ఏకాగ్రతకు సహాయపడతాయి.