తమలపాకు అనేక ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. భోజనం తర్వాత తమలపాకులు నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, జీర్ణ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అజీర్ణం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఈ క్రమంలో తమలపాకు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలు: గ్యాస్, మలబద్ధకం లేదా ఆమ్లత్వంతో బాధపడేవారికి తమలపాకులు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
మధుమేహ రోగులు: తమలపాకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం..దీనిని తినడం డయాబెటిక్ రోగులకు ప్రయోజనం లభిస్తుంది.
శ్వాసకోశ సమస్యలు: తరచుగా దగ్గు, జలుబు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నవారికి తమలపాకులు ప్రభావవంతమైన ఔషధంగా పనిచేస్తాయి. ఇది కఫాన్ని తొలగించి, గొంతును క్లియర్ చేస్తుంది.
ఎముక, కీళ్ల నొప్పి: ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పితో బాధపడేవారికి, తమలపాకులు ఒక వరం అని చెప్పవచ్చు. దీని ఔషధ లక్షణాలు వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
దుర్వాసన: తమలపాకులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని నమలడం వల్ల దుర్వాసన తొలగిపోతుంది. దంతాలు, చిగుళ్ళు బలపడతాయి.