ఈరోజుల్లో ఒత్తిడి అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. దీనికి పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు కారణాలు. అయితే ఒత్తిడిని సరిగ్గా నిర్వహించకపోతే అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ క్రమంలో ఒత్తిడిని త్వరగా ఎలా తగ్గించుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
సంగీతం వినడం: ఇష్టమైన, ప్రశాంతమైన సంగీతాన్ని కొన్ని నిమిషాల పాటు వింటే, అది మనసును మరల్చి, ఆందోళనను తగ్గిస్తుంది. అంతేకాదు, ఒత్తిడి హార్మోన్ అయినా కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది.
ధ్యానం: అధిక ఒత్తిడి కి గురైతే కొన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకుని జ్ఞానం చేయాలి. ఇది మనసులోనే ఆలోచనల ప్రవాహాన్ని తగ్గిస్తుంది. భవిష్యత్తు గురించి కాకుండా, ప్రెసెంట్ లో ఉండడానికి ప్రయత్నించాలి.
పకృతితో గడపడం: వీలైనంతవరకు రోజుల్లో కొంత సమయం పకృతితో గడపాలి. ఎందుకంటే పకృతిలో ఉండే ప్రశాంతత మన మనసును తేలికపరిచి, ఒత్తిడి నుండి బయటపడడానికి సహాయపడుతుంది.
వాకింగ్ చేయడం: ఒత్తిడిని తగ్గించుకోవడానికి అద్భుతమైన మార్గం వాకింగ్ చేయడం. వాకింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి సహజ సిద్ధమైన నొప్పి నివారణగా మూడు బూస్టర్ గా పనిచేస్తాయి.