శరీరాన్ని హానికరమైన మూలకాల నుండి రక్షించడంలో యాంటీఆక్సిడెంట్లు సహాయపడుతాయి. ఈ హానికరమైన మూలకాలు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది అనేక వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు చర్మం వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలో యాంటీఆక్సిడెంట్లు ఉండే ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
టీ: చాలామంది ఇష్టంగా తాగే టీలో యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే కొన్ని అంశాలు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చేస్తుంది.
బెర్రీలు: బెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్లు పుషకాలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన మూలకాలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. అదనంగా, ఈ బెర్రీలలో విటమిన్-సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఆకుపచ్చ కూరగాయలు: పాలకూర, బ్రోకలీ, కాలే వంటి ఆకుపచ్చ కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ కూరగాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వీటిలో విటమిన్-సి, విటమిన్-కె కూడా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి.
డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ లో విటమిన్-సి, విటమిన్-ఇ, సెలీనియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పరిగణిస్తారు.ఈ పోషకాలు శరీరాన్ని హానికరమైన మూలకాల నుండి రక్షించడానికి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడతాయి.
సుగంధ ద్రవ్యాలు: పసుపు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఈ సుగంధ ద్రవ్యాలు ఆహార రుచిని పెంచడమే కాకుండా శరీరాన్ని హానికరమైన అంశాల నుండి రక్షిస్తాయి. అంతేకాదు, ఇవి మెరుగైన జీర్ణక్రియ, మెరుగైన రోగనిరోధక శక్తి, చర్మ కాంతి పెరగడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.