కొన్ని ఆహారపు అలవాట్లు కిడ్నీలకు ప్రమాదకరం అని తెలుసా? నేటి బిజీ లైఫ్ లో జీవితంలో తరచుగా తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించడం పూర్తిగా మానేశాం. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతుంటే లేదా దీని నివారించాలనుకుంటే, ఈ క్రింది 5 ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
ఉప్పు: ఉప్పు ఆహారం రుచిని పెంచుతుంది. కానీ, అధిక ఉప్పు మూత్రపిండాలకు హానికరం. ఉప్పులో ఉండే సోడియం శరీరంలో కాల్షియం మొత్తాన్ని పెంచుతుంది. దీని కారణంగా మూత్రపిండాల్లో కాల్షియం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఊరగాయలు, ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
చాక్లెట్, పాలకూర, గింజలు: ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న, ఇష్టమైన చాక్లెట్, పాలకూర, అనేక రకాల గింజలు (బాదం, వేరుశెనగ వంటివి) మూత్రపిండాల్లో రాళ్లను కలిగిస్తాయి. వీటిలో ఉండే ఆక్సలేట్ అనే సమ్మేళనం కాల్షియంతో కలిసి రాళ్లను ఏర్పరుస్తుంది. ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ల వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
రెడ్ మీట్: తరచుగా రెడ్ మీట్ తినడం మూత్రపిండాలకు మంచిది కాదు. రెడ్ మీట్లో ప్యూరిన్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్‌ను ఏర్పరుస్తుంది. అధిక మొత్తంలో యూరిక్ యాసిడ్ కూడా మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది. దీనికి బదులుగా పరిమిత పరిమాణంలో చికెన్ లేదా చేపలను తినవచ్చు.
సోడా, చక్కెర పానీయాలు: చల్లని పానీయాలు, సోడా, ఇతర చక్కెర పానీయాలు బరువును పెంచడమే కాకుండా మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. వాటిలో భాస్వరం, ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉంటాయి. ఇది రాళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. వీటికి బదులుగా సాదా నీరు, నిమ్మరసం లేదా కొబ్బరి నీరు తాగడం చాలా మంచిది.
ప్రాసెస్ చేసిన ఆహారాలు: ఈరోజుల్లో చాలామంది తరచుగా పిజ్జా, బర్గర్లు, ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడానికి ఇష్టపడుతారు. వీటిలో సోడియం, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రపిండాలకు నేరుగా హాని కలిగిస్తాయి.