పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పండ్లు తీయగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి అనేకు ప్రయోజనాలను అందిస్తాయి. కానీ కొన్ని పండ్లు ఆరోగ్యానికి హానికరం కలిగిస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు కొన్ని పనులకు దూరంగా ఉండటమే మంచిది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ద్రాక్ష పండ్లలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒక కప్పు ద్రాక్ష ఫ్రూట్స్ లో 23 గ్రాముల షుగర్ ఉంటుంది. వీటిని తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.
ఎంతో రుచికరంగా ఉండే ఫైనాపిల్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకి మంచి చేస్తాయి. ఈ పండు తిన్నవెంటనే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇందులో దాదాపు 16 గ్రాముల షుగర్ ఉంటుంది.
అరటిపండు తక్షణ శక్తిని అందిస్తుంది. ఒక అరటి పండులో దాదాపు 14 గ్రాముల షుగర్ ఉంటుంది. ఈ పండు తినడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ అమాంతం పెరుగుతుంది.
కింగ్ అఫ్ ఫ్రూట్ అని పిలిచే మామిడి పండులో నేచురల్ షుగర్స్ అధికంగా ఉంటాయి. ఒక మీడియం సైజ్ మామిడి పండులో దాదాపు 45 గ్రాముల షుగర్ ఉంటుంది. కావున దీని తింటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి.