మనకున్న కొన్ని అలవాట్లే మన శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి. అందులో కొన్ని అలవాట్లు మనకు మంచి చేస్తే, మరి కొన్ని చెడు చేస్తాయి. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే అలవాటు లేనిటో చూద్దాం.
నిద్ర:ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర ఉండాలి. నిద్ర లేకపోతే మూడు స్వింగ్స్ పెరుగుతాయి. అంతేకాదు ఫోకస్, జ్ఞాపకశక్తి తగ్గుతాయి. నిద్రలేమి సమస్య డయాబెటిస్, ఉబకాయం గుండె జబ్బులకు కారణం అవుతుంది.
స్మోకింగ్: సరదాకి స్మోకింగ్ చేసిన అది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. దీనివల్ల ఊపిరితిత్తి సమస్యలు ఎదురవుతాయి. ఒక సమయానికి వస్తే ఊపిరి పీల్చుకోవడానికి కూడా సాధ్యపడదు.
ఆహారం: తీసుకునే ఆహారం పైన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. సమయానికి తినకపోవడం, తక్కువ కెలరీలు తీసుకోవడం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు సమతుల్య ఆహారం తీసుకోకపోతే డయాబెటిస్, గుండె జబ్బులు వస్తాయి. అలాగే వీలైనంతవరకు మాంసం, షుగర్ ఫుడ్స్ తినడం తగ్గించాలి.
ఆల్కహాల్: తక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితమైన దాని వినియోగం వల్ల కాలేయం దెబ్బతింటుంది. అంతేకాదు దీని అధికంగా తీసుకుంటే ఇతర అవయవాలు కూడా పాడవుతాయి.
శారీరక శ్రమ: నేటి ఆధునిక జీవన శైలిలో చాలామంది శారీరక శ్రమకు దూరమవుతున్నారు. దీనివల్ల అనేక సమస్యలు తలెత్తవచ్చు. అందుకే రోజు వాకింగ్, సైకిలింగ్, స్కిప్పింగ్, యోగా వంటి వ్యాయామాలు చేయడం మంచిది. దీనివల్ల శరీరం నుండి విష పదార్థాలు బయటికి వెళ్తాయి.