మనం తీసుకునే ఆహారంలో అన్నానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే చాలా మంది రోజూలో మూడు పూటలా అన్నమే తింటుంటారు. ఇక కొందరికైతే అన్నం కాకుండా ఇంకేం తిన్నా కడుపునిండిన భావన కలగదు! అన్నం శరీరానికి శక్తినిచ్చే ప్రధాన కార్బోహైడ్రేట్. అయితే, మూడు పూటలా అన్నమే తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రైస్ లో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరంలో గ్లూకోజ్‌గా మారి కొవ్వుగా పేరుకుపోతాయి. దీంతో ఊబకాయం వస్తుంది.
వైట్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా అన్నం తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీని ఫలితంగా వచ్చే డయాబెటిస్ ప్రమాదం ఉంటుంది.
అన్నంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. కావున ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె సమస్యలకు దారితీస్తుంది.
రైస్ లో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరంలో గ్లూకోజ్‌గా మారిపోతాయి. దీంతో కొంత సమయంలోనే మళ్లీ ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. అన్నం తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి వేగంగా పెరుగుతుంది.
అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ, సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యం. రోజులో ఒకపూట అన్నం తిని, మిగతా రెండు పూటలు ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అలాగే అన్నం తినేప్పుడు పప్పు, కూర, పెరుగు, సలాడ్ వంటివి తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 30–45 నిమిషాల వ్యాయామం, తగినంత నీరు, మంచి నిద్ర ఉంటె సరిపోతుంది.