ఈరోజుల్లో చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో అధిక బరువు కూడా ఒకటి. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యల కు దారితీస్తుంది. బరువు తగ్గడానికి జిమ్ లు, యోగ, కఠినమైన డైట్ లు చేస్తుంటారు. అయినా ఆశించినంత ఫలితాలు అందవు. అయితే రోజువారి డైట్ లో కొన్ని పండ్లను చేర్చుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయ: పుచ్చకాయ బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 100 గ్రాముల పుచ్చకాయలో కేవలం 30 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో ఉండే అమైనో ఆమ్లం కొవ్వును ఇట్టే కరిగిస్తుంది. తరచుగా పుచ్చకాయను తీసుకుంటే ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలిగిస్తుంది. పదే పదే తినే అలవాటును నివారిస్తుంది.
జామ పండు: జామ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ కారణంగా ఆకలిని నిరోధిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. జామకాయ కొలెస్ట్రాల్ రహితమైనది,
ద్రాక్ష పండు: ద్రాక్ష పండులో విటమిన్ సి, పోలిక్ ఆమ్లం, పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఉబకాయం, మధుమేహం, గుండె సమస్యల వంటి అనేక దీర్ఘకాలిక సమస్యలను నిర్వహించడంలో సహాయపడుతుంది.