మనం ఆరోగ్యంగా ఉండాలన్న, శక్తివంతంగా ఉండాలన్న డైట్ లో డ్రై ఫ్రూట్స్ ఉండేటట్లు చూసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనడంలో సహాయపడుతాయి.
బాదంపప్పు: బాదంపప్పులో ఫైబర్, విటమిన్ E, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఎముకలను బలంగా చేస్తాయి. చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.
పిస్తా పప్పులు: పిస్తా పప్పులలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు B6,E , పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయి. దీని రోజువారి వినియోగం గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
వాల్ నట్స్: వాల్ నాట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ E, విటమిన్ B6, పోలీస్ ఆమ్లం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కావున ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తోంది. వాల్ నట్స్ జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్షలో ఐరన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. అంతేకాదు రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎండుద్రాక్ష ఎముకలను బలోపేతం చేస్తుంది.