మనం తీసుకునే ఆహారంపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, తాజా కూరగాయలు డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా పండ్ల లో ఉండే విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి ఉపయోగపడే పనులేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
దానిమ్మ పండు: దానిమ్మ పండులో ఉండే కొన్ని పోషకాలు కిడ్నీ స్టోన్స్ ను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాదు, ఇవి బ్రెయిన్ హెల్తును మెరుగుపరుస్తాయి. అలాగే రక్తపోటును కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
జామకాయ:జామకాయలో ఉండే పోషకాలు రక్తంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. జామపండు దీర్ఘకాలిక వ్యాధుల రిస్కును సైతం తగ్గిస్తాయి.
పైనాపిల్: పైనాపిల్ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు ఇది వెళుతున్న మెరుగుపరిచి జీర్ణ క్రియను సులభం చేస్తుంది.
కివి: కివి పండు సైజు లో చిన్నగా ఉన్న, దీని లాభాలు మాత్రం అనేకం. ఇది మానసిక స్థితిని మెరుగుపరచి నిద్ర సమస్యలను దూరం చేస్తుంది.
బొప్పాయి: బొప్పాయి ఒత్తిడిని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో పదేపదే తినడం నివారించవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన పండు.
ఆరెంజ్: ఆరెంజ్ రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. బ్లడ్ ప్రెజర్ ను సైతం తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఇన్ఫ్లమేటర్ లక్షణాలు శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడుతాయి.