మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది రక్తాన్ని పంప్ చేస్తుంది. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. అయితే, ఈరోజుల్లో మూత్రపిండాల సంబంధిత వ్యాధులు సర్వసాధారణంగా మారాయి. దీనికి జీవనశైలి, ఆహార అలవాట్లు ప్రధాన కారణాలు. ఈ క్రమంలో మూత్రపిండాలను జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో ముఖ్యం. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం కొన్ని అలవాట్లు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అయితే, అధిక గోరువెచ్చని నీటిని తాగడం అంత మంచిది కాదు.
రుచికోసం ఎక్కువగా ఉప్పు తీసుకుంటే, అది మూత్రపిండాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఉదయాన్నే అల్పాహారంలో ఎక్కువ ఉప్పు తినకుండా ఉండాలి. దీనికి కారణం ఎక్కువ ఉప్పు తీసుకుంటే మూత్రం నుండి కాల్షియం తగ్గుతుంది. ఇది మూత్రపిండాలలో రాళ్ల సమస్యలకు దారితీస్తుంది.
తరచుగా ఉదయం యోగా లేదా వ్యాయామం చేయాలి. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉండటమే కాదు, మూత్రపిండాలను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, వ్యాయామం చేసేటప్పుడు వచ్చే చెమట ద్వారా శరీరం విషపదార్థాలు బయటకు వస్తాయి.
ఉదయం టీ లేదా కాఫీ తాగితే అలవాటు ఉంటె మానుకోవాలి. దీనికి కారణం టీ, కాఫీ తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంటుంది.