కరోనా ఎఫెక్ట్, అత్యాధునిక సాంకేతికత ఏఐ కారణంగా చిన్న కంపెనీల నుంచి మల్టీ నేషనల్ కంపెనీల వరకూ వేల సంఖ్యలో ఉద్యోగాల కోత జరుగుతోంది. ఎక్కడ లేఆఫ్స్ ప్రకటిస్తారో అనే భయంతో ఎన్నో ఫ్యామిలీ, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్తో ఆందోళనతో బతుకుతుంటారు. ఇలాంటి సమయాల్లో మన భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఉన్నంతలో సంతోషంగా బతకాలి. అదెలాగో తెలుసుకుందాం..
మీరు ఏదైనా ఉద్యోగంలో ఉన్నప్పుడు ముందుగా అభద్రత, అసూయకు కారణాన్ని తెలుసుకొని మీ కెపాసిటీ, అచీవ్మెంట్, బలహీనత ఆధారంగా ఇతరులతో పోల్చుకోకండి. మీరు చేసే పనిపై దృష్టి సారించడం ద్వారా ప్రశాంతంగా ఉండొచ్చు.
అభద్రత, సహోద్యోగుల పట్ల అసూయ మీ మైండ్‌ను తొలిచేస్తున్నప్పుడు.. ‘‘నా ఉద్యోగంలో నాకు భద్రత ఉంది’’ అని చిత్తశుద్ధితో ఉండటం ద్వారా మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మీ నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలనేది ఆలోచించండి.
ఉద్యోగంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి, యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు చేస్తూ.. మైండ్‌ఫుల్‌నెస్‌తో పనిచేయడం అలవాటు చేసుకోండి.
మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని “ఈ క్షణం నాది’’ అని అని భావించండి. పనిలో ప్రతికూల ఆలోచనలు వస్తున్నట్లయితే.. చిన్నపాటి నడకను అలవాటు చేసుకోండి.
విధి నిర్వహణలో మీరు అందుకున్న ప్రతిదానికీ కృతజ్ఞతగా ఉంటూ థ్యాంక్ఫుల్నెస్ అనే విధానాన్ని ఆచరించండి. కృతజ్ఞతా భావంతో మీ మనస్సు ఎప్పుడూ పాజిటివ్‌నెస్‌తో నిండి ఉంటుంది.
మీకు సపోర్ట్‌గా ఉంటూ మిమ్మల్ని ప్రోత్సహించే వారితో మంచి సంభాషణను కలిగి ఉండండి. ఎవరినీ ఎగతాళి చేయకండి. మీ కోసం నలుగురు ఉన్నారనే భావన మీరు ఆందోళన నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.