మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా ఈరోజుల్లో చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో అధిక కొలెస్ట్రాల్ ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, రోజువారీ జీవనశైలిలో కొన్ని సాధారణ మార్పులు చేసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
భోజనం తర్వాత 10–15 నిమిషాల నడక జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
చేపలు, వాల్నట్లు, అవిసె గింజలు వంటి ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు LDL ను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు డైట్ లో ఉండేలా చూసుకోవాలి. ఓట్స్, ఆకుపచ్చ కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి.
ప్యాక్ చేసిన ఆహారాలు, నూనె, నెయ్యి అధికంగా ఉండే ఆహారాలను నివారించాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం లేదా యోగా చేయడం హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ధూమపానం, మద్యం మానుకోవాలి. ఈ రెండూ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని త్వరగా దెబ్బతీస్తాయి.