ఉదయాన్నే టీ తాగనిదే రోజూ గడవదు కొందరికి. చాలామంది ఉదయం, సాయంత్రం.. ఇలా సమయం, సందర్భం లేకుండా ఎప్పుడు టీ తాగుతుంటారు. ఇది మానసిక స్థితిని రిఫ్రెష్ చేసిన, ఆరోగ్యానికి ప్రమాదకరం. అయితే అనేక కప్పుల టీ తాగే అలవాటు శరీరాన్ని క్రమంగా బలహీనపరుస్తుందని తెలుసా? ముఖ్యంగా ఇది విటమిన్ లోపానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా అలసట, బలహీనత, ఆరోగ్య సమస్యలు పెరగడం ప్రారంభిస్తాయి.
టీలో ఉండే టానిన్లు శరీరంలో విటమిన్ బి12 తగ్గిస్తాయి. దీని కారణంగా టీ అధికంగా తీసుకునేవారిలో ఈ విటమిన్ లోపం కనిపిస్తుంది. బి12 లోపం ఉన్నప్పుడు శరీరంలో మొదటి ప్రభావం శక్తి స్థాయిలో కనిపిస్తుంది. త్వరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది.
B12 లోపం మెదడు, నాడీ వ్యవస్థ పై కూడా ప్రభావితం చూపుతుంది. తరచుగా టీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. దృష్టి పెట్టడం కష్టమవుతుంది. ఈ విటమిన్ శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కావున ఇది రక్తహీనతకు దారితీస్తుంది.
ఎక్కువగా టీ తాగడం వల్ల B12 లోపం శరీరంలో ఎముకలు, కండరాలను బలహీనపరుస్తుంది. క్రమంగా కీళ్ల నొప్పులు, శరీర నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. టీ ఎక్కువగా తీసుకుంటే కడుపులో గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం వంటి సమస్యలు పెరుగుతాయి.
కావున రోజుకు 1 నుండి 2 కప్పుల కంటే ఎక్కువ టీ తాగకూడదు. B12 లోపాన్ని అధిగమించడానికి డైట్ లో పాలు, గుడ్లు, జున్ను, పెరుగు, ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి.