Panchayat elections: రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఓ యువతి తన ఓటు హక్కు వినియోగించుకుని ఆదర్శంగా నిలిచింది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మండలం పెద్దబుధ గ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో.. రష్యా నుంచి వచ్చి మానస అనే యువతి ఓటు వినియోగించుకుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.






