స్లీప్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు ఏకకాలంలో అనేక వ్యాధులకు బలవుతున్నారు. ఈ కారణంగా, నిద్ర సమస్యలను చిన్నవిగా తీసుకోవడం తగదు. సమస్య మొదటి దశలో ఉండగానే పరిష్కారం కనుగొనడం చాలా అవసరం.
నిద్రకు గుండె ఆరోగ్యంపైనూ ప్రభావం ఉంది. ఎనిమిది గంటల నిద్రపోయే స్త్రీలతో పోలిస్తే, తొమ్మిది నుంచి 11 గంటల మధ్య నిద్రపోతున్న మహిళల్లో కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం దాదాపు 38 శాతం ఎక్కువగా ఉందని ఓ పెద్ద సర్వే తెలిపింది.
ఎక్కువ నిద్రపోయే వారిలో బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎనిమిది గంటల కన్నా ఎక్కువగా నిద్రపోయే వారు, సాధారణంగా ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య నిద్రపోతున్నవారితో పోలిస్తే, భవిష్యత్తులో ఊబకాయానికి గురయ్యే అవకాశాలు దాదాపు 21 శాతం ఎక్కువగా ఉంటాయని గుర్తించారు.
ఇదే తరహాలో, అతి నిద్ర కారణంగా రక్తంలోని షుగర్ లెవెల్ పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని సమతుల్యం చేయాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. ముఖ్యంగా రోజూ తొమ్మిది గంటలకు మించి నిద్రపోతున్నవారు ఈ ప్రమాదానికి ఎక్కువగా గురవుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.