Actress Yogalakshmi: టూరిస్ట్ ఫ్యామిలీతో ఫేమస్ అయిన యోగలక్ష్మీ తన అందంతో కుర్రాళ్ల మతిపొగోడుతోంది. జీన్స్, బ్లాక్ టీషర్ట్ ఫోటోల్లో ఈ బ్యూటీని చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు.
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో చిన్నపాత్ర చేసి ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది కోలీవుడ్ నటి యోగలక్ష్మీ.
ఈ మూవీలో ఆమె నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇందులో లవ్ ప్రపోజల్ సీన్ అయితే యువత మళ్లీ మళ్లీ చూస్తున్నారు.
అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ ఎవరని నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు ఆడియెన్స్. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ ప్రస్తుతం హాట్ స్టార్ లో ట్రెండింగ్ లో ఉంది.
ఇది వరకే ఈ అమ్మడు కోలీవుడ్ లో హార్ట్ బీట్, సింగపెన్నె వంటి వెబ్ సిరీస్ చేసింది. హార్ట్ బీట్ తెలుగులో కూడా ఉంది.
ఆ వెబ్ సిరీస్ లతో రానీ గుర్తింపు ఈ ముద్దుగుమ్మకు టూరిస్ట్ ఫ్యామిలీతో వచ్చింది. దీని తర్వాత ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది యోగలక్ష్మీ. అటు గ్లామరస్ గా కనిపిస్తూనే.. ఇటు చీరకట్టులోనూ మైమరిపిస్తుంది.
తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన జీన్స్, బ్లాక్ టీషర్ట్ ఫోటోలు నెట్టింట హీట్ పెంచేస్తున్నాయి.