20 ఏళ్లక్రితం హీరోయిన్‌గా మెప్పించడం గొప్ప కాదు.. 20 ఏళ్లుగా మెప్పిస్తూనే ఉండటం గొప్ప అని త్రిష గురించి విజయ్ చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తు ఉండే ఉంటాయి. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్థానం ఇప్పుడు పాతికేళ్ల వైపు అడుగులు వేస్తోంది.
- Advertisement -
హీరోయిన్స్ వయసు పెరిగేకొద్ది అందం తగ్గుతుంది. కానీ త్రిషలో మాత్రం రోజురోజుకూ.. అందం పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి అన్ని జాగ్రత్తలను త్రిష తీసుకుంటుందని చెబుతుంది.
రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా, చారిత్రాత్మక సబ్జెక్ట్ అయినా మేకర్స్ ఫస్ట్ ఛాయిస్ త్రిషే అవుతున్నారు. తన సినిమాల్లో త్రిషను బ్యాక్ టు బ్యాక్ తీసుకోవడానికి రీజన్ కూడా అదేనని ఈ మధ్య మణిరత్నం రివీల్ చేశారు.2026 సంక్రాంతికి కరుప్పు, సమ్మర్‌కి విశ్వంభరతో రెడీ అవుతున్నారు త్రిష. కోలీవుడ్‌లో కరుప్పు కి ఎంత క్రేజ్ ఉందో, స్టాలిన్ తర్వాత వచ్చే విశ్వంభరకి టాలీవుడ్‌లోనూ అంతే క్రేజ్ ఉంది.ఓ వైపు సిల్వర్ స్క్రీన్ మీద సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఓటీటీ ప్రాజెక్టులను కూడా డీల్ చేస్తున్నారు ఈ బ్యూటీ. పోలీస్ ఆఫీసర్‌గా ఈ ముద్దుగుమ్మ నటించిన బృంద ఫస్ట్ సీరీస్ జనాలను మెప్పించింది.