Typhoon Kalmegi: ఫిలిప్పీన్స్‌ను కల్మేగీ తుపాను హడలెత్తిస్తోంది. దేశ మధ్య ప్రాంతంలోని సెబు, ఈస్టర్న్ సమర్, గుయిమరస్, బొహొల్, పలవన్ ప్రావిన్స్‌లపై తుపాన్ తీవ్రత అధికంగా ఉంది. దీంతో 85 మంది మృతి చెందగా.. మరో 76 మంది గల్లంతయ్యారు.
- Advertisement -



ఇళ్లను వరద ముంచెత్తడంతో సహాయం కోసం ప్రజలు ఇళ్ల పైకప్పులు ఎక్కి.. రక్షించాలంటూ వందల సంఖ్యలో ప్రజలు అధికారులను వేడుకున్నారు.

కల్మేగీ తుపాను ప్రభావంతో సెబూలో అధిక ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఇక్కడ 49 మంది మృత్యువాతపడ్డారని, 13 మంది గల్లంతయ్యారని అధికారులు పేర్కొన్నారు.



