Saturday, November 15, 2025
Homeగ్యాలరీUric Acid Diet: శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గించే పండ్లు.. ఇవి తింటే సూపర్‌...

Uric Acid Diet: శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గించే పండ్లు.. ఇవి తింటే సూపర్‌ బెనిఫిట్స్‌..!

Uric Acid Diet Eat These Fruits: నేటి ఆధునిక కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. ఫలితంగా శరీరంలో యూరిక్ యాసిడ్ ప్రభావాలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలో చాలా మంది ఈ యూరిక్ యాసిడ్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో పాదాల అరికాళ్ళు, మోకాలు, మోచేతులలో నొప్పి మొదలవుతుంది.

ఎక్కువసేపు కూర్చుంటే పాదాలు కూడా ఉబ్బుతాయి. ఇక్కడే ఆర్థరైటిస్ కూడా మొదలవు తుంది. యూరిక్ యాసిడ్‌ను ప్రారంభంలోనే నివారించగలిగితే సమస్యకు పూర్తిగా చెక్‌ పెట్టొచ్చని వైద్యులు అంటున్నారు. లేదంటే సమస్య పెరుగుతుంది. ఇది మొదట నొప్పితో ప్రారంభమైనప్పటికీ యూరిక్ యాసిడ్ మూత్రపిండాలు, గుండెకు మీద కూడా తీవ్ర ప్రభావాలు చూపుతుంది.
యూరిక్ యాసిడ్ లక్షణాలు గుర్తించినప్పుడు సాధారణంగా ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. పాలకూర, టమోటాలు, పప్పులు, మాంసం, చేప నూనె, కాఫీ, కేకులు, వీటిని అస్సలు తినకూడదు. అయితే మూడు రకాల పండ్లు మాత్రం ఖచ్చితంగా తినాలి. వీటిని క్రమం తప్పకుండా తింటే, అవి మ్యాజిక్‌లా పనిచేస్తాయి. ఒంట్లో యూరిక్ యాసిడ్ వేగంగా తగ్గుతుంది.
యూరిక్‌ యాసిడ్‌ లెవల్స్‌ తగ్గించే పండ్లలో యాపిల్స్ ముఖ్యమైనవి. విటమిన్ సి మాత్రమే కాదు.. యూరిక్ యాసిడ్ తగ్గించడంలో విటమిన్ ఎ కూడా గొప్పగా పనిచేస్తుంది. ఈ విషయంలో ఆపిల్స్ సరైన పండు. ఆపిల్స్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం వల్ల యూరిక్‌ యాసిడ్ కూడా దూరంగా ఉంటుంది.
నిమ్మకాయలు విటమిన్ సి, యూరిక్ యాసిడ్‌కి పెద్ద శత్రువు. శరీరంలో విటమిన్ సి స్థాయి పెరిగినప్పుడు యూరిక్ యాసిడ్ మ్యాజిక్‌లా తగ్గుతుంది. కాబట్టి నారింజ, నిమ్మకాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఫలితంగా యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గడం మీరు గమనిస్తారు.
చెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీర నొప్పులను తగ్గిస్తుంది. అంతే కాదు ఈ పండు యూరిక్ యాసిడ్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad