చాలా మంది ఒక్క పూట అయినా టీ తాగకుండా ఉండలేరు. అయితే ఎక్కువ టీ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. టీ బదులు ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
కూరగాయలను ఉడికించిన నీళ్లను తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కూరగాయలు ఉడికించిన నీళ్లలో చిటికెడు ఉప్పు కలిపి తాగితే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా అందుతాయి. రుచి కోసం మిరియాల పొడి కూడా కలపొచ్చట.
కాఫీ, టీలకు బదులు వేడిగా ఉన్న కూరగాయలు ఉడికించిన నీటిని తాగితే అలసట పోయి ఉత్సాహంగా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారికి ఈ నీరు దివ్య ఔషధం. గోరు చిక్కుడు, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, బీట్రూట్ వంటి వాటిని ఉడికించిన నీరు తాగితే రక్తహీనత నుంచి బయటపడొచ్చు.
అయితే ఈ నీటిని సూప్, పులుసు, నూడుల్స్, పాస్తా, ఫ్రైడ్ రైస్ వంటి వాటిల్లో కూడా వాడితే రుచికరంగానూ, ఆరోగ్యంగానూ ఉంటుంది.