Vijay New Look: తెలుగు సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులర్ అయిన నటీ నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు. తన తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే అభిమానులతో పాటు విమర్శకుల మనసును సైతం దోచుకున్నాడు.
- Advertisement -
ఇటీవల హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్‌మెంట్ అయింది.ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విషయాన్ని వారి సన్నిహితులు స్వయంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది.అమ్మాయిల మనసు దోచుకున్న.. ఈ వరల్డ్ ఫెమస్ లవర్ గ్యారేజిలో జర్మన్, బ్రిటీష్, అమెరికన్, స్వీడన్ బ్రాండ్లకు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి.అంతే కాకుండా హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పరిసరాల్లో రూ. కోట్ల విలువైన బంగ్లాలో నివసిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్ రష్మిక వివాహానికి ముహూర్తం కుదరడంతో విజయ్ దేవరకొండ అభిమానులు తమ ఆనందాలను వ్యక్తం చేస్తున్నారు.