HomeTop StoriesVIROSH: సందడిగా 'విరోష్' మెహందీ వేడుక.. చాలా త్వరగా ముగిసిందంటూ పోస్ట్.!
VIROSH: సందడిగా ‘విరోష్’ మెహందీ వేడుక.. చాలా త్వరగా ముగిసిందంటూ పోస్ట్.!
VIROSH: సందడిగా 'విరోష్' మెహందీ వేడుక.. చాలా త్వరగా ముగిసిందంటూ పోస్ట్.!
టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్- రష్మిక మూడు ముళ్ల బంధంతో ఇటీవల ఒక్కటైన విషయం తెలిసిందే.
గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
పెళ్లి తర్వాత విరోష్ జంట.. ఫ్యామిలీ మీట్, అన్న ప్రసాదాలు, సొంత ఊరిలో గృహ ప్రవేశం, భోజనాలు ఇలా బిజీబిజీగా గడిపారు.
ఆ తర్వాత రిసెప్షన్ వేడుకను సినీ, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులతో అట్టహాసంగా జరుపుకొన్నారు.
వీరి పెళ్లి, రిసెప్షన్, మిగతా వేడుకలకు దాదాపు రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు ఖర్చయిందని సమాచారం.
వేడుకలకు సంబంధించిన ఫొటోలను విరోష్ జంట వరుసగా ఇన్స్టాలో షేర్ చేసుకుంటున్నారు.
నేడు తాజాగా మెహందీ వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు ఈ జంట.
రష్మిక చేతిపై ఆధ్యాత్మిక భావంతో కూడిన మెహందీ సింపుల్ డిజైన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఇరు కుటుంబాలు, బంధువుల సమక్షంలో విజయ్- రష్మిక మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి.
వేడుకకి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.