పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే పుచ్చకాయ, జామకాయ, ద్రాక్ష పండ్లు మన బరువు తగ్గించటంలో అద్భుతం సహాయంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునే వారికి పుచ్చకాయ ఉత్తమమైన పండ్లలో ఒకటి. ఇందులో 90% నీరే ఉంటుంది. 100 గ్రాముల పుచ్చకాయలో కేవలం 30 కేలరీలు మాత్రమే ఉంటాయి.
పుచ్చకాయలో ఉండే అమైనో ఆమ్లం ఆర్జినిన్ కొవ్వును త్వరగా కరిగించడానికి సహాయపడుతుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాక కడుపు నిండుగా ఉండేలా చేసి భోజనాల మధ్య ఆకలి కాకుండా చేస్తుంది.
జామకాయ పోషకమైనది, రుచికరమైనది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. జామకాయలో కొలెస్ట్రాల్ ఉండదు, ఇతర పండ్ల కంటే ఇందులో తక్కువ చక్కెర ఉంటుంది.
జామకాయలో నిమ్మ జాతి పండ్ల కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, అందంగా ఉంచడానికి కూడా దోహదపడుతుంది.
ద్రాక్షపండులో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం పోషకాలు ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
ద్రాక్ష పండ్లు కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే బరువు త్వరగా తగ్గుతారని నిపుణులు సూచిస్తున్నారు.