పుట్టినరోజు అంటే అందరికీ ప్రత్యేకమే… దీనిని ప్రతి ఒక్కరూ వేడుకగా జరుపుకుంటారు. ఇక బర్త్ డే అనగానే ముందుగా కేక్, క్యాండిల్స్ ముందుగా గుర్తొస్తాయి. పుట్టిన రోజునాడు కొవ్వొత్తులను ఎందుకు ఊది కేక్ కట్ చేస్తారు.. దశాబ్దాల కాలంగా ఆచరణలో ఉన్న.. ఇలా ఎందుకు చేస్తారో చాలామందికి తెలియదు. దీని వెనుక అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయడం అనే సంప్రదాయం మధ్య యుగాలలో.. జర్మనీలో పుట్టిందని చరిత్ర చెబుతోంది. ఈ వేడుకనే కిండర్ ఫెస్ట్ అని పిలిచేవారంట. అయితే అప్పట్లో బర్త్ డే కేక్స్ ఇప్పటిలా ఉండేవి కావట. కానీ మొత్తానికి పుట్టినరోజు కేకులను ఉపయోగించిన మొదటి దేశం జర్మనీ.
కొవ్వొత్తులను మొదట ఉపయోగించింది మాత్రం గ్రీకులు. ఆర్టెమిస్ దేవతను గ్రీకులు పూజించేవారు. ఆమె ఆరాధించే సమయంలో గ్రీకులు క్యాండిల్స్ వెలిగించేవారని తెలుస్తోంది. ఇక ఆమెను పూజించేటపుడు గుండ్రని కేకుపై క్యాండిల్స్ వెలిగించేవారట.
గ్రీకులు తయారు చేసిన కేక్‌లు గుండ్రంగా చంద్రుని ఆకారం పోలి ఉండేవట. క్యాండిల్స్ నుంచి వచ్చే వెలుగు చంద్రుని కాంతికి ప్రతీకగా భావించేవారని చరిత్ర అంటోంది. అనంతరం అక్కడ ప్రార్ధనలు చేసి ఆ క్యాండిల్స్ ఊదేవారని తెలుస్తోంది.
ఇక అసలు విషయం అంతా క్యాండిల్స్ ఊదిన తరువాత వచ్చే పొగలోనే ఉంది. క్యాండిల్స్ ఊదినపుడు పొగ పైకి వెళ్తుంది.. ఈ పొగను గ్రీకులు పవిత్రంగా భావించేవారట. ఎందుకంటే వారు ఏవైతే కోరికలు కోరుకుంటూ ప్రార్థనలు చేస్తారో అవి పొగద్వారా తమ దేవత అయిన ఆర్టెమిస్‌కు చేరతాయని.. అలా తమ కోరికలు నెరవేరతాయని నమ్మేవారు.
అందుకే పుట్టినరోజు నాకు కేక్ కట్ చేసిన తరువాత క్యాండిల్స్ ఊదడం అనేది అలవాటుగా మారింది. పుట్టినరోజు నాడు క్యాండిల్స్ ఊదడం వెనుక దాగి ఉన్న స్టోరీ ఇది అన్న ప్రచారంలో ఉంది. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)