ఇన్సులిన్ హార్మోన్ క్లోమం నుంచి విడుదల కానప్పుడు లేదా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయినప్పుడు రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పుతాయి.
ఏదైనా తిన్న వెంటనే రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది.
ఆహారం నుంచి కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని 10 శాతం తగ్గించి, ప్రోటీన్ మొత్తాన్ని 20 శాతం పెంచి.. మిగిలిన కేలరీల్ని కొవ్వు రూపంలో తీసుకోండి. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ సమతుల్యంగా ఉంటాయి.
బంగాళదుంపలు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. చక్కెర రోగులు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు ఎక్కువ తినకూడదు.
బంగాళాదుంపను వేయించినా లేదా డీప్ ఫ్రై చేసినా, దానిలోని కార్బోహైడ్రేట్ల పరిమాణం మరింత పెరుగుతుంది.