Saturday, November 15, 2025
Homeగ్యాలరీFitness secret: మలైకా అరోరా ఫిట్‌నెస్ రహస్యం మీకు తెలుసా?

Fitness secret: మలైకా అరోరా ఫిట్‌నెస్ రహస్యం మీకు తెలుసా?

Malaika Arora fitness secret: బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె వయసు 51 ఏళ్లు దాటినా 16ఏళ్ల యవ్వనంలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఆమే అందం వెనుక అద్భుతమైన ఫిట్‌నెస్ రహస్య ఉంది. అదేంటో తెలుసుకుందామా!

మలైకా అరోరా అందానికి కేవలం జిమ్ వర్కౌట్స్‌కే పరిమితం కాలేదు. ప్రాచీన చైనీస్ సంస్కృతిలోని కొన్ని రహస్యాలను ఆమె తన దైనందిన జీవితంలో పాటిస్తుంది.
వయసును కేవలం ఒక సంఖ్యగా మార్చిన మలైకా.. చైనీస్ సంస్కృతిలో ప్రాచుర్యం పొందిన కిగాంగ్, తాయ్ చి (Tai Chi) వంటి ప్రాచీన వ్యాయామ పద్ధతులను పాటిస్తుంది.
చైనా వ్యాయామ పద్ధతల్లో శరీరంలోని వివిధ అవయవాలలో పేరుకుపోయిన ఒత్తిడిని కొన్ని ప్రత్యేక శబ్దాల ద్వారా బయటకు పంపే పద్ధతి ఉంటుంది. ఇది అంతర్గత అవయవాలను రిఫ్రెష్ చేస్తుంది.
ది టైగర్ ఫ్రోలిక్: ఇది ఫైవ్ నిమల్ ఫ్రోలిక్స్‌లో ఒక భాగంగా ఉంటుంది. పులి కదలికలను అనుకరించే ఈ వ్యాయామం ఎముకలు మరియు కండరాలను బలోపేతం చేస్తుందట. అంతేకాకుండా శరీరాన్ని చురుకుగా సైతం ఉంచుతుందని నమ్మకం.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad