Saturday, November 15, 2025
Homeగ్యాలరీAkkineni Akhil Wedding: అట్టహాసంగా అక్కినేని అఖిల్ వివాహం..!

Akkineni Akhil Wedding: అట్టహాసంగా అక్కినేని అఖిల్ వివాహం..!

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడయ్యాడు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె జైనాబ్ రవ్జీతో అతడు ఏడడుగులు వేసి కొత్త జీవితం ప్రారంభించాడు. జుబ్లీహిల్స్‌లోని తమ కొత్త ఇంట్లో ఈ వివాహ వేడుకను ఘనంగా జరిగింది.

- Advertisement -

ఈ వేడుక పూర్తిగా ప్రైవేట్‌గా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరి మాత్రమే హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేష్, రానా, ప్రశాంత్ నీల్, అక్కినేని ఫ్యామిలీతో పాటు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ వేడుకలో కనిపించారు.

గతేడాది నవంబర్ 26న అఖిల్, జైనాబ్‌ల ఎంగేజ్‌మెంట్ జరగగా, అప్పట్లోనే ఈ జంటపై ఆసక్తి పెరిగింది. వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందా అని అప్పటి నుంచి అభిమాను ఎందురు చూశారు.

అయితే అఖిల్ వివాహం అట్టహాసంగా జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ వివాహం కూడా అంతే సింపుల్‌గా, గ్రేస్‌ఫుల్‌గా పూర్తవడంతో అక్కినేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అఖిల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నారు. ఈ ఫోటోల్లో నూతన జంటతో పాటు.. నాగార్జున, అమల కూడా కనిపించారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన అఖిల్ – జైనాబ్‌లకు అభిమానుల వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఈ నెల 8న (ఆదివారం) సాయంత్రం గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించేందుకు నాగార్జున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, పలు ప్రముఖ నటీనటులు హాజరయ్యే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad