నిమ్మకాయ నీరు: నిమ్మకాయ నీరు శరీరాన్ని డిటాక్స్ చేస్తూ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మకాయ మీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఈ రోజుల్లో ఊబకాయం తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారిపోయింది. దీనికి అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపాల వాట్లు కారణాలు. ఊబగాయం జీవ క్రియ లోపాలు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. ఈ క్రమంలో ఉబకాయాన్ని తగ్గించడానికి జీరో క్యాలరీ లేదా తక్కువ కేలరీలు, అధిక పోషక విలువలు కలిగిన ఆహారాలు తీసుకోవాలి. తద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు.
నిమ్మకాయ నీరు: నిమ్మకాయ నీరు శరీరాన్ని డిటాక్స్ చేస్తూ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మకాయ మీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
దోసకాయ: దోసకాయలో దాదాపు 96% నీరు ఉంటుంది. దీని కారణంగానే ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
బ్రోకలీ: బ్రోకలీ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. బ్రోకలీ బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
క్యారెట్: క్యారెట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొవ్వును సులభంగా కలిగిస్తుంది. క్యారెట్ ఆకలిని తగ్గించి శరీర బరువును అదుపులో ఉంచుతుంది.