Friday, September 20, 2024
Homeహెల్త్Brown Rice: బ్రౌన్ రైస్ లో ఆరోగ్యమెంతో..

Brown Rice: బ్రౌన్ రైస్ లో ఆరోగ్యమెంతో..

ఒత్తిడి, డిప్రషన్, యాంగ్జయిటీలకు విరుగుడు బ్రౌన్ రైస్


బ్రౌన్ రైస్ ఇపుడు చాలామందే వాడుతున్నారు. బరువు తగ్గడానికో, లేదా షుగర్ ని నియంత్రణలో ఉంచడానికో ఇలా రకరకాల కారణాలతో బ్రౌన్ రైస్ ను చాలామంది ఉపయోగిస్తున్నారు. దంపుడుబియ్యం లేదా ముడిబియ్యం అనే ఈ బ్రౌన్ రైస్ కూడా తృణధాన్యమే. వీటిల్లో మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, థియామైన్, నియాసిన్, విటమిన్ బి6, మాంగనీస్ లతో పాటు కొన్ని పీచుపదార్థాలు సైతం ఉన్నాయి.

- Advertisement -

అలాగే బ్రౌన్ రైస్ లో ఫ్లెవనాయిడ్స్, ఫినోల్స్ అనే రెండు రకాల యాంటాక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా సంరక్షిస్తాయి. తొందరగా వయసు మీదపడకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు ఈ తృణదాన్యంలో బోలెడు విటమిన్లు, ఖనిజాలతో పాటు కాల్షియం, ఐరన్ లు కూడా పుష్కలంగా ఉన్నాయి. బ్రౌన్ రంగులో ఉండే ఈ ధాన్యంలో ఒరిజనల్ ధాన్యంలో ఉండే బార్న్ (ఊక), జర్మ్, ఎండెస్పెర్మె అనే మూడు ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. ఇవి ఇచ్చే ఆరోగ్యం ఎంతో. వైట్ రైస్ కన్నా కూడా బ్రౌన్ రైస్ వల్ల మనం పొందే ఆరోగ్య లాభాలు కూడా చాలా ఎక్కువ. అందుకే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. బ్రౌన్ రైస్ మధుమేహాన్ని నియంత్రణలో పెడతుంది.

బ్లడ్ షుగర్ ఎక్కువ కాకుండా నియంత్రిస్తుంది. రోజుకు మూడుసార్లు బ్రౌన్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్కు 32 శాతం తగ్గే అవకాశం ఉందని కొన్ని స్టడీలు నిర్ధారిస్తున్నాయి. అదే వైట్ రైస్ తినడం వల్ల డయాబెటిస్ రిస్కు బాగా ఎక్కువవుతుందని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. ఒక స్టడీ ప్రకారం తెల్ల బియ్యం తక్కువగా తినేవాళ్లల్లో కన్నా ఎక్కువగా తినేవాళ్లల్లో డయాబెటిస్ రిస్కు 17 శాతం పెరుగుతుందని తేలింది. బ్రౌన్ రైస్ లో పోషకాలు బాగా ఎక్కువ. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ తృణధాన్యంలో డైటరీ ఫైబర్ కూడా ఉంది. బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంది. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వాటి బారిన పడే రిస్కు తక్కువ. బ్రౌన్ రైస్ శరీర బరువును కూడా నియంత్రిస్తుంది. ఊబకాయులు తమ బరువును తగ్గించుకోవడంలో బ్రౌన్ రైస్ బాగా ఉపయోగపడుతుందని డైటీషియన్లు చెపుతున్నారు.


అంతేకాదు వాళ్ల బాడీ మాస్ ఇండెక్స్ కూడా తగ్గుతుందంటున్నారు. వైట్ రైస్ లో కన్నా బ్రౌన్ రైస్ లోనే
డైటరీ ఫైబర్ ఎక్కువ ఉండడం బ్రౌన్ రైస్ మంచిదని భావించడానికి మరో ముఖ్య కారణం. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినడం వల్ల కడుపు నిండుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. అందుకే మళ్లీ మళ్లీ వారికి తినాలని అనిపించదు. బ్రౌన్ రైస్ తినేవారికి అనారోగ్యకరమైన క్రేవింగ్స్ కూడా ఉండవు. బ్రౌన్ రైస్ లో పోషకాలు కూడా ఎక్కువే. ఒక అరకప్పు బ్రౌన్ రైస్ లో 108 కాలరీలు, ప్రొటీన్లు 3 గ్రాములు, ఫ్యాట్ ఒక గ్రాము, కార్బోహైడ్రేట్లు 22 గ్రాములు, పీచుపదార్థాలు రెండు గ్రాములు, చక్కెర జీరో ఉంటుంది. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే సర్వింగ్ కు అరకప్పు ఉడికించిన బ్రౌన్ రైస్ ఉండాలి.

వండని అరకప్పు బ్రౌన్ రైస్ మనకు ఉడికించిన ఒక కప్పు అన్నాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే అరకప్పు సర్వింగ్ కు పరిమితం కావాలి. బ్రౌన్ రైస్ ఎన్నో అనారోగ్య సమస్యలకు
మంచి మందు మాత్రమే కాదు న్యూరో డిజెనరేటివ్ డిజార్డర్లకు కూడా ఇది బాగా పనికివస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే బ్రౌన్ రైస్ న్యూరో ప్రొటెక్టివ్ ఎఫెక్టును కలిగి ఉంటుంది. అంతేకాదు బ్రౌన్ రైస్ వాడకం వల్ల ఒత్తిడి, డిప్రషన్, యాంగ్జయిటీ వంటి సమస్యల నుంచి సైతం బయటపడతాము. బ్రౌన్ రైస్ వాడకం కాగ్నిటివ్ డిస్ఫంక్షన్ రిస్కును సైతం తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News