Sunday, July 7, 2024
Homeహెల్త్Homemade scrub: శరీరాన్ని మెరిపించే ఎనిమిది ఇంటి స్క్రబ్స్

Homemade scrub: శరీరాన్ని మెరిపించే ఎనిమిది ఇంటి స్క్రబ్స్

హోం మేడ్ స్క్రబ్ చాలా చవక, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు

చర్మం మెరుపులు చిందించాలని ఎవరు కోరుకోరు చెప్పండి? చర్మం కాంతివంతంగా ఉండడానికి ఎన్నో కాస్మొటిక్ క్రీమ్స్ ఉన్నాయి. అలాగే చర్మాన్ని మెరిపించే ఇంట్లోనే సింపుల్ గా చేసుకునే చిట్కాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇంట్లోనే ప్రక్రుతి సిద్ధమైన పదార్థాలతో బాడీ స్క్రబ్స్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునే ఇలాంటి స్క్రబ్స్ ఖరీదు ఉండవు. ఇవి చర్మాన్ని ఎంతగానో మెరిపిస్తాయి కూడా. ఈ బాడీ స్క్రబ్స్ చర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా కాంతివంతంగా, పట్టులా మెత్తగా చేస్తాయి.

- Advertisement -


కాఫీ, చక్కెర కలపి చేసే బాడీ స్క్రబ్ చర్మాన్ని ఎంతో మెరిపిస్తుంది. పావు కప్పు కాఫీ పొడి, పావుకప్పు చక్కెర, రెండు టేబుల్ స్పూన్ల ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, మూడు విటమిన్ ఇ కాప్సూల్స్ తీసుకుని వీటిన్నింటినీ కలిపి గరుగ్గా ఉండే పేస్టులా చేయాలి. దీన్ని శరీరానికి, ముఖానికి పట్టించాలి. వేళ్లతో సున్నితంగా మసాజ్ చేస్తూ ఈ పేస్టును చర్మానికి అప్లై చేయాలి. ఐదు నుంచి పది నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసిన తర్వాత హైడ్రేటింగ్ బాడీ స్క్రబ్, గోరువెచ్చటి నీటితో శరీరాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కాఫీలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

చక్కెర మంచి ఎక్స్ ఫొయిలేటర్ గా పనిచేస్తుంది. చర్మంపై చేరిన మ్రుత కణాలను పోగొడుతుంది కూడా. ఆలివ్ ఆయిల్ చర్మం లోపలికంటా వెడుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేటింగ్ గా ఉంచడంతో పాటు ఎంతో ఆరోగ్యంగా చర్మం మెరిసేలా చేస్తుంది. సీ సాల్ట్ బాడీ స్కర్బ్ కూడా శరీరానికి ఎంతో మంచిది. ఒక కప్పు సీ సాల్ట్, అరకప్పు ఆలివ్ ఆయిల్, మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా ఐదు నుంచి పదిహేను చుక్కలు వీటన్నింటినీ కలిపి గరుగ్గా ఉండే పేస్టులా చేయాలి. చర్మాన్ని క్లీన్ చేసుకుని ఈ పేస్టును స్కిన్ కు పట్టించాలి. వేళ్లతో సున్నితంగా చర్మంపై ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ చేస్తూ ఈ పేస్టును చర్మానికి పట్టించాలి. తర్వాత హైడ్రేటింగ్ బాడీ స్క్రబ్, గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. సీసాల్ట్ లో ఖనిజాలు బాగా ఉంటాయి. ఇవి మంచి ఎక్సెఫొయిలేటింగ్ ఏజెంట్లు. ఇవి మీ చర్మాన్ని యంగ్ గా, ఆరోగ్యంగా కనిపించేట్టు చేస్తాయి. ఈ స్క్రబ్ రాసుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరగడంతో పాటు స్కారింగ్ లాంటి సమస్యలను సైతం పరిష్కరిస్తుంది.

కోకోనట్ ఆయిల్ బాడీ స్క్రబ్ కూడా మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. దీనికి పావు నుంచి అరకప్పు గరిగా ఉండే చక్కెర, అరకప్పు కొబ్బరి నూనె తీసుకోవాలి. ఈ రెండింటినీ కలిపి పేస్టులా చేసి దాన్ని క్లీన్ చేసుకున్న చర్మంపై పూయాలి. ఐదు నుంచి పదినిమిషాల పాటు సున్నితంగా చర్మంపై మసాజ్ చేయలి. తర్వాత హైడ్రేటింగ్ బాడీ స్క్రబ్, గోరువెచ్చటి నీటితో శరీరాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇది మంచి ఎక్స్
ఫొయిలేటింగ్ ఏజెంట్. అంతేకాదు మీ ముఖాన్ని, చర్మాన్ని కూడా బాగా శుభ్రం చేస్తుంది. తగినంత మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. కొబ్బరినూనెలోని యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్ గుణాలు చర్మం ఎలాంటి ఇన్ఫెక్షన్ల పాలబడకుండా సంరక్షిస్తాయి.


ఆలివ్ ఆయిల్, పెప్పర్మెంట్, సుగర్ స్క్రబ్ కూడా శరీరంపై, ముఖంపై బాగా పనిచేస్తుంది. చర్మాన్ని మ్రుదువుగా, కాంతివంతంగా మారుస్తుంది. దీనికి పావు కప్పు ఆలివ్ ఆయిల్, ఒక కప్పు బ్రౌన్ షుగర్, పదిహేను చుక్కల పెప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని ఆ మూడింటినీ కలిపి పేస్టులా చేయాలి. చర్మాన్ని శుభ్రం చేసుకుని దానిపై ఈ పేస్టును అప్లై చేయాలి. ఐదు నుంచి పది నిమిషాలు చర్మంపై వేళ్లతో సున్నితంగా మసాజ్ చేస్తూ ఈ పేస్టును చర్మానికి పట్టించాలి. తర్వాత హైడ్రేటింగ బాడీ స్క్రబ్, గోరువెచ్చటి నీటితో ముఖాన్ని, శరీరాన్ని కడుక్కోవాలి.


ఓట్మీల్ బాడీ స్క్రబ్ కూడా చర్మాన్ని ఎంతగానో మెరిపిస్తుంది. అరకప్పు వండని ఓట్మీల్, అరకప్పు బ్రౌన్ షుగర్, అరకప్పు ముడి తేనె, పావు కప్పు జొజొబా ఆయిల్, రెండు చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, నాలుగు చుక్కల జెరనియం ఎసెన్షియల్ ఆయిల్, నాలుగు చుక్కల ఫ్రాంకిన్సెస్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి. పొడిగా ఉన్న పదార్థాలను గ్రైండర్ లోవేసి మెత్తగా పొడి చేయాలి. ఆ పొడిలో పైన పేర్కొన్న నూనెలన్నింటినీ కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. చర్మాన్ని బాగా శుభ్రం చేసుకుని ఈ పేస్టును రాసుకోవాలి. ఐదు నుంచి పది నిమిషాలు సున్నితంగా చర్మంపై మసాజ్ చేయలి. ఇది మీ బాడీని బాగా ఎక్స్ ఫొయిలేట్ చేస్తుంది. తర్వాత హైడ్రేటెడ్ బాడీ స్క్రబ్, గోరువెచ్చటి నీటితో శరీరాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఓట్మీల్ సహజసిద్ధమైన ఎక్స్ ఫొయిలేటర్. చర్మంపై ఉండే మ్రుతకణాలను ఇది పోగొట్టడమే కాదు చర్మాన్ని పట్టులా చేస్తుంది. అంతేకాదు చర్మానికి ఎంతో సాంత్వననిస్తుంది కూడా.

యోగర్ట్ బాడీ స్ర్రబ్ కూడా చర్మాన్ని బాగా ఎక్స్ ఫొయిలేట్ చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పెరుగు, పావు కప్పు ఆలివ్ ఆయిల్, ఒక టీస్పూను తేనె, మూడు టేబుల్ స్పూన్ల గర గరగా ఉండే చక్కెర వీటన్నింటిని కలిపి పేస్టులా చేయాలి. దాన్ని శుభ్రం చేసుకున్న చర్మంపై అప్లై చేయాలి. దానితో ఐదు నుంచి పది నిమిషాలు చర్మంపై సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత హైడ్రేటెడ్ బాడీ స్క్రబ్, గోరువెచ్చని నీటితో శరీరాన్ని, ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పెరుగు చర్మాన్ని ఎంతో బాగా శుభ్రం చేస్తుంది. చర్మంపై ఉండే మ్రుతకణాలను, మలినాలను పోగొడుతుంది. అంతేకాదు చర్మానికి కావలసినంత మాయిశ్చరైజింగ్ ని కూడా అందిస్తుంది.


వనీలా, సుగర్ బాడీ స్క్రబ్ శరీరాన్ని ఎంతో శుభ్రంగా ఉంచడమే కాదు మీ మేనిని పట్టులా మెరిసేట్టు చేస్తుంది. ఒకటిన్నర కప్పు బ్రౌన్ షుగర్, ఒక కప్పు వైట్ షుగర్, ఒక కప్పు ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన వెనీలా ఎక్స్ ట్రాక్ట్ వీటన్నింటినీ కలిపి పేస్టులా చేసి శుభ్రం చేసిన చర్మంపై అప్లై చేయాలి. దీనితో ఐదు నుంచి పది నిమిషాలు చర్మంపై సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత హైడ్రేటింగ్ బాడీ స్క్రబ్, గోరువెచ్చటి నీటితో శరీరాన్ని, ముఖాన్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆర్గానిక్ టర్మెరిక్ బాడీ స్క్రబ్ చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఒక కప్పు చక్కెర, రెండు టీస్పూన్ల పసుపు, ఒకటిన్నర కప్పు కొబ్బరి నూనె ఈ మూడింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. చర్మంపై దీన్ని పూసి ఐదు నుంచి పది నిమిషాలు వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత హైడ్రేటింగ్ బాడీ స్క్రబ్, గోరువెచ్చటి నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. పసుపులో యాంటిసెప్టిక్ , యాంటిబాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేయడమే కాదు చర్మం యంగ్ గా ఉండేట్టు కూడా ఎంతగానో సహాయపడతాయి.


నిమ్మ, చక్కర బాడీ స్క్రబ్ చర్మానికి చాలా మంచిది. రెండు టేబుల్ స్పూన్ల చక్కెర, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక నిమ్మకాయ తీసుకోవాలి. చక్కెర, తేనె మిశ్రమంలో నిమ్మరసం పిండి పేస్టులా చేయాలి. ఈ పేస్టును శుభ్రం చేసుకున్న చర్మంపై అప్లై చేయాలి. ఈ పేస్టుతో ఐదు నుంచి పది నిమిషాలు చర్మంపై సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత హైడ్రేటింగ్ బాడీ స్క్రబ్, గోరువెచ్చటి నీళ్లతో శరీరాన్ని శుభ్రం చేయాలి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. అంతేకాదు నిమ్మలో ఎక్స్ ఫొయిలేటింగ్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని బాగా శుభ్రం చేస్తుంది. అంతేకాదు చర్మాన్ని మ్రుదువుగా, పట్టులా చేస్తుంది కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News