Saturday, March 14, 2026
HomeTop StoriesAnti agein: మీ ముఖం మెరవాలంటే వీటిని తినడం మానేయాల్సిందే.. ఏంటంటే

Anti agein: మీ ముఖం మెరవాలంటే వీటిని తినడం మానేయాల్సిందే.. ఏంటంటే

Anti agein:  మనలో చాలా మంది స్కిన్ గ్లో కోసం ఖరీదైన క్రీములు, సీరమ్స్ వాడుతుంటారు. కానీ బయట నుంచి రాసే క్రీమ్ కంటే లోపలికి వెళ్తున్న ఆహారం ప్రభావం చాలా ఎక్కువ. ఒక డెర్మటాలజిస్ట్ చెప్పినట్టు, రోజూ తినే కొన్ని ఆహారాలు మన చర్మంలోని కొలాజెన్‌ను దెబ్బతీస్తూ, ఇన్‌ఫ్లమేషన్ పెంచుతూ, వయస్సు కన్నా ముందే ముడతలు తెచ్చేస్తాయి. ఇప్పుడు ఆ 3 ముఖ్యమైన ఆహారాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

- Advertisement -

మొదటిగా హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్

ఇది ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూసులు, బిస్కెట్లు, కేక్స్, ప్రాసెస్డ్ స్నాక్స్‌లో ఉంటుంది. ఇది ఒక రకమైన సింథటిక్ షుగర్. ఈ షుగర్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత గ్లైకేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. గ్లైకేషన్ వల్ల కొలాజెన్ ప్రోటీన్ కఠినంగా మారుతుంది. కొలాజెన్ మన చర్మాన్ని బిగుతుగా, లవలవలాడేలా ఉంచే ప్రధాన నిర్మాణం. అది దెబ్బతింటే చర్మం సడలిపోతుంది, ముడతలు త్వరగా వస్తాయి. పైగా హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది. ఇన్‌ఫ్లమేషన్ పెరిగితే మొటిమలు, చర్మ ఎర్రదనం, పిగ్మెంటేషన్ సమస్యలు వస్తాయి. బయట నుంచి ఎలాంటి క్రీమ్ వాడినా లోపల ఈ డ్యామేజ్ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి సోడాలు, కలర్ డ్రింక్స్, ఎక్కువగా చక్కెర కలిగిన ప్యాకేజ్డ్ ఫుడ్స్ తగ్గించడం చాలా ముఖ్యం.

రెండవది మళ్లీ మళ్లీ వేడి చేసిన నూనె

ఒకటికి రెండు సార్లు వేడి చేసిన నూనెలో చేసిన వంటకాలు. చాలా హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఒకే నూనెను పలుమార్లు వేడి చేస్తుంటారు. నూనెను రీపీటెడ్‌గా వేడి చేస్తే ఆక్సిడైజ్డ్ ఫ్యాట్స్ తయారవుతాయి. ఇవి శరీరంలోకి వెళ్లిన తర్వాత ఫ్రీ రాడికల్స్‌ను పెంచుతాయి. ఫ్రీ రాడికల్స్ చర్మ కణాలను దెబ్బతీస్తాయి. దీని వల్ల చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది, త్వరగా వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు, ఈ ఆక్సిడైజ్డ్ ఫ్యాట్స్ శరీరంలో లోపలి ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి. దీర్ఘకాలంగా ఇలా తింటూ ఉంటే చర్మం మాత్రమే కాదు, గుండె ఆరోగ్యంపైనా ప్రభావం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు ఇంట్లో తాజా నూనెతో చేసిన వంటలు తినడం మంచిది. బయట ఫ్రై చేసిన వంటకాలు అలవాటుగా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి.

Read Also: Hair growth tips: జుట్టు రాలడం ఆగి.. ఒత్తుగా పెరగాలా?.. మునగాకు పౌడర్, జ్యూస్‌లలో ఏది పవర్‌ఫుల్?

మూడవది డీప్ ఫ్రై చేసిన క్రిస్పీ ఫుడ్స్

చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు, బజ్జీలు లాంటి వాటిని ఎక్కువ ఉష్ణోగ్రతలో వేయిస్తారు. అలా వేయించినప్పుడు అక్రిలమైడ్ అనే కెమికల్ ఏర్పడుతుంది. అలాగే అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అని పిలిచే ఏజీఈలు కూడా తయారవుతాయి. ఇవి కొలాజెన్‌ను నేరుగా దెబ్బతీస్తాయి. చర్మం కఠినంగా, రఫ్‌గా మారుతుంది. ముడతలు త్వరగా పడతాయి. పైగా ఆయిల్ ఎక్కువగా ఉండటం వల్ల మొటిమల సమస్య పెరుగుతుంది. దీర్ఘకాలంలో చర్మం కాంతి కోల్పోతుంది. అందుకే ప్రతిరోజూ చిప్స్ ప్యాకెట్లు తినడం, ఫ్రెంచ్ ఫ్రైస్ అలవాటు చేసుకోవడం స్కిన్‌కు చాలా హానికరం.

గుర్తుంచుకోవాల్సిన విషయం

ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, స్కిన్ కేర్ అంటే కేవలం బయట రాసే ఉత్పత్తులు కాదు. మన ప్లేట్‌లో ఏముంది అన్నదే అసలు కీలకం. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, నట్స్, గింజలు ఇవి కొలాజెన్‌ను కాపాడటంలో సహాయపడతాయి. తగినంత నీరు తాగడం కూడా చాలా అవసరం. నీరు తక్కువగా తాగితే చర్మం డ్రైగా మారుతుంది, ముడతలు త్వరగా కనిపిస్తాయి.

ఆ ఆలోచనే వద్దండి బాబూ..

చాలా మంది “మేము మంచి క్రీమ్ వాడుతున్నాం కాబట్టి పర్లేదు” అనుకుంటారు. కానీ నిపుణుల మాట ప్రకారం, అనారోగ్యకరమైన ఆహారం వల్ల వచ్చే లోపలి నష్టం ఎలాంటి క్రీమ్ పూర్తిగా సరిచేయలదు. కాబట్టి స్కిన్ గ్లో కావాలంటే ముందుగా ఆహార అలవాట్లను మార్చుకోవాలి. సోడాలు, సింథటిక్ షుగర్స్, డీప్ ఫ్రైడ్ స్నాక్స్ తగ్గించి, సహజమైన ఆహారానికి అలవాటు పడాలి. అందుకే అందంగా కనిపించాలంటే కేవలం మేకప్ కాదు, మంచి ఆహారం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News