Sunday, December 8, 2024
Homeహెల్త్Acne problem? మొటిమలా, జస్ట్ ఇది తాగితే పోతాయి

Acne problem? మొటిమలా, జస్ట్ ఇది తాగితే పోతాయి

ఇది చాలా సహజసిద్ధంగా చేసుకునే ప్యాక్

ఈ డ్రింకు తాగితే…నో యాక్నే…

- Advertisement -

యాక్నే లేని పట్టులాంటి చర్మం కావాలనుకుంటున్నారా? హార్మోనల్ యాక్నేతో బాధపడుతున్నారా? అయితే మీ సమస్యను పరిష్కరించే ఒక మంచి డ్రింకు ఉంది. దీన్ని మీరు ఎంతో సులువుగా మీ వంటింట్లో చేసుకోవచ్చు కూడా. ఈ డ్రింకులో కొల్లాజిన్, విటమిన్ ఎ లు పుష్కలంగా ఉన్నాయని
పోషకాహారనిపుణులు కూడా చెపుతున్నారు. ఈ డ్రింకు తాగితే చర్మం మృదువుగా ఉండి ఎంతో మెరిసిపోతుంటుందని కూడా వారంటున్నారు. యాక్నేను పోగొట్టే ఈ డ్రింకును మూడు పదార్థాలను కలిపి తయారుచేస్తారు.

అవే కరివేపాకు, గులాబి రేకులు, ధనియాలు. ధనియాలు చర్మంపై యాక్నే రాకుండా నిరోధిస్తాయి. ఈ గింజల్లో యాంటాక్సిడెంట్లతో పాటు యాంటి ఇన్ఫమ్లేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అవి ముఖంపై ఏర్పడే ముడతలు, పిగ్మెంటేషన్లను తగ్గిస్తాయి. అంతేకాదు చర్మంపై చేరిన మృతకణాలను పోగొట్టడంతో పాటు స్కిన్ కు కావలసిన హైడ్రేషన్ ను కూడా బాగా అందిస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది. గులాబి రేకుల విషయానికి వస్తే ఇవి మంచి సువాసనలు చిందించడమే కాదు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే సుగుణాలు కూడా వీటిల్లో ఎన్నో ఉన్నాయి. అందుకే యాక్నే సోకకుండా చర్మాన్ని పరిరక్షించడంలో ఇవి ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయి. గులాబి రేకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మనిషి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని బాగా పెంచుతాయి. అంతేకాదు చర్మాన్ని పట్టులా, మరెంతో బిగువుగా ఉంచడంతో పాటు యాక్నే ఫ్రీగా మలుస్తాయి.

ఇక ఈ డ్రింకులో ఉపయోగించే మరో పదార్థం కరివేపాకులు. ఇవి కూడా చర్మంపై యాక్నే తలెత్తకుండా
నిరోధిస్తాయి. వీటిల్లో యాంటీమైక్రోబియల్ సుగుణాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఎ, సి వంటి విటమిన్లు బోలెడు ఉన్నాయి. ఈ మూడు పదార్థాలతో చేసిన డ్రింకు చర్మాన్ని ముడతలు పడనివ్వదు. చర్మంపై ఉండే నల్లటి వలయాలను తగ్గిస్తుంది. ఈ డ్రింకు వయసును తెలియనివ్వకుండా మిమ్మల్ని యంగ్ గా కనిపించేలా చేస్తుంది. చర్మంపై యాక్నే చాయలు లేకుండా చేస్తుంది.


ఈ డ్రింకు ఎలా చేస్తారంటే …

కరివేపాకకు, గులాబిరేకులు, ధనియాలు ఈ మూడింటినీ నీటిలో వేసి మరగనివ్వాలి. ఆ నీటిని వొడగట్టి ఒక పెద్ద గ్లాసు నిండా పోసుకుని తాగాలి. అంతే. ఇలా రోజూ చేస్తే మీ చర్మం యాక్నే చాయలు లేకుండా పట్టులా మెరిసిపోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News